గిరిశిఖర గ్రామాల్లో రోడ్లకు ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2020-11-28T05:00:57+05:30 IST

గిరిశిఖర గ్రామాల్లో రోడ్ల నిర్మాణా నికి ప్రతిపాదనలు పంపించినట్టు పార్వతీపురం ఓఎస్‌డీ సూర్యచంద్రరావు తెలిపారు.

గిరిశిఖర గ్రామాల్లో రోడ్లకు ప్రతిపాదనలు

మక్కువ: గిరిశిఖర గ్రామాల్లో రోడ్ల నిర్మాణా నికి ప్రతిపాదనలు పంపించినట్టు పార్వతీపురం ఓఎస్‌డీ సూర్యచంద్రరావు తెలిపారు. మండలంలోని ఏజెన్సీ గిరిశిఖర గ్రామాలైన ఒంగుజోల, చిలకమెండంగి, బంద మెండంగి, తాడిపుట్టి, సిరివర గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గిరిశిఖర గ్రామాల్లో పర్యటించినప్పుడు గిరిజనులు నడిచేందుకు రోడ్లు సక్రమంగా లేవని గుర్తించామని చెప్పారు. బాగుజోల గ్రామం నుంచి సిరివర గ్రామానికి రూ.12 కోట్లతో ఎల్‌డబ్ల్యూసీ పథకం కింద రోడ్డు నిర్మాణానికి ప్రతిపా దనలు పంపించినట్టు తెలిపారు.  గిరిజనులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గిరి శిఖర గ్రామాల అభివృద్ధికి రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్‌శాఖ తరఫున నివేదికలు పంపించామని తెలిపారు.  ఎస్‌ఐ కె.రాజేష్‌, శిక్షణ ఎస్‌ఐ రమ్యశ్రీ, పోలీస్‌, ఎస్టీఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read more