ప్రైవేటు వైద్యుల సేవలు నిలిపివేత
ABN , First Publish Date - 2020-12-12T05:24:21+05:30 IST
కేంద్ర వైద్య చట్టాలకు నిరసనగా శుక్రవారం ప్రైవేటు వైద్యులు సేవలను నిలిపివేశారు.ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అత్యవసర సేవలు మినహాయించి మిగతా ఓపీ సేవలను నిలిపివేసి నిరసన తెలిపారు.
కేంద్ర వైద్య చట్టాలపై నిరసన
రింగురోడ్డు, డిసెంబరు 11: కేంద్ర వైద్య చట్టాలకు నిరసనగా శుక్రవారం ప్రైవేటు వైద్యులు సేవలను నిలిపివేశారు.ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అత్యవసర సేవలు మినహాయించి మిగతా ఓపీ సేవలను నిలిపివేసి నిరసన తెలిపారు. ఇండియన మెడికల్ అసోసియేషన (ఐఎంఏ), ఇండియన డెంటల్ అసోసియేషన (ఐడీఏ), ప్రైవేటు నర్సింగ్‌హోం అసోసియేషన (అప్నా) పిలుపు మేరకు నిరసన తెలిపినట్టు ఆసోసియేషన జిల్లా ప్రతినిధులు వీఎస్ ప్రసాద్, జెసీ నాయుడు, సతీష్‌లు తెలిపారు. వారు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్స చేయడానికి అనుమతిస్తూ భారతీయ కేంద్ర వైద్య మండలి (సీసీఐఎం) తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరైన శిక్షణ లేకుండా అల్లోపతి వైద్యం చేయడానికి అనుమతిస్తే రోగి ప్రాణానికి ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటేడ్ మెడిసిన పేరిట ఆధునిక వైద్య విధానాన్ని నాశనం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన ప్రతినిధులు వెంకటేశ్వరరావు, మృత్యుంజయరావు, మధుకర్, త్రినాథరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.