చికిత్స కంటే నివారణే మేలు : జేసీ-2

ABN , First Publish Date - 2020-03-18T11:05:21+05:30 IST

వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చే యించుకోవడం కంటే రాకముందే నివారణ చర్యలు తీసుకోవడం ఎం తో మేలని జేసీ-2 ఆర్‌.కూర్మనాథ్‌ అన్నారు. జిల్లా విపత్తులు నివారణ

చికిత్స కంటే నివారణే మేలు : జేసీ-2

కలెక్టరేట్‌, మార్చి 17 : వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చే యించుకోవడం కంటే రాకముందే నివారణ చర్యలు తీసుకోవడం ఎం తో మేలని జేసీ-2 ఆర్‌.కూర్మనాథ్‌ అన్నారు. జిల్లా విపత్తులు నివారణ సంస్థ, నెహ్రూ యువ కేంద్రం సంయుక్తంగా కరో నా వ్యాధిపై మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటో రియంలో అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై అంతగా భయపడాల్సిన అవసరం లే నప్పటికీ అప్రమత్తంగా ఉండాలన్నారు. మన వాతారణంలో కరోనా వైరస్‌ ఎక్కువ కాలం బతికే అవకాశం లేదన్నారు.


ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. శ్వాస వ్యవస్థలపై ఈ వైరస్‌ దాడి చేస్తుందన్నారు. తుమ్ములు దగ్గు, స్వల్పంగా జ్వరం, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు ఉన్నవారు వైద్యులు సలహాలు తీసుకోవాలన్నారు. జిల్లా విపత్తులు నివారణాధికారి బి.పద్మావతి మాట్లాడుతూ కరోనా వ్యాధి కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిందన్నారు. సోషల్‌ మీడియా లో వదంతులను వ్యాప్తి చేయొద్దని, అలా చేస్తే చట్ట ప్రకారం కఠినంగా శిక్ష పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజీవ్‌ విద్యా మిషన్‌ పీవో ఎం.కృష్ణమూర్తినాయుడు, నెహ్రూ యువ కేంద్రం కోర్డినేటర్‌ విక్రమాదిత్య, డాక్టర్‌ సుబ్రమణ్యం, డాక్టర్‌ ఆదిత్య వర్మ, ఎస్‌బీ రావ, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ ఎల్‌ఎస్‌ నాయుడు, వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-18T11:05:21+05:30 IST