ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధం

ABN , First Publish Date - 2020-11-20T04:46:52+05:30 IST

వచ్చే నెల 25న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ చెప్పారు. దీని కోసం రెవెన్యూ అధికారులు సిద్ధం కావాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్‌లో నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదే రోజున జిల్లాలో సుమారు 35 వేల గృహ నిర్మాణాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధం
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

వెంటనే స్థలాలను కేటాయించండి

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌, నవంబరు 19: వచ్చే నెల 25న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌  చెప్పారు. దీని కోసం రెవెన్యూ అధికారులు సిద్ధం కావాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్‌లో నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదే రోజున జిల్లాలో సుమారు 35 వేల గృహ నిర్మాణాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఇళ్ల పట్టాల కోసం స్పందనలో అందిన దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన వారిని జాబితాలో చేర్పించాలన్నారు. ఇప్పటికీ లాటరీ తీయని వారు వెంటనే లాటరీ తీసి.. స్థలాలను కేటాయించి.. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. జగనన్న పచ్చతోరణం కింద లే అవుట్లలో మొక్కలు వేయాలని చెప్పారు. కోర్టు కేసులు ఉన్న చోట ప్రత్యామ్నాయ స్థలాలను చూడాలని సూచించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి జిల్లాలో 92 కోర్టు కేసులు ఉన్నాయని, వాటిలో 59 పరిష్కారమయ్యాయని, మిగిలిన 33 కేసులకు కౌంటర్లు వేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యాంశాలైన సచివాలయాలు, వెల్నెస్‌ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను త్వరగా పూర్త చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల కోసం మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న స్థలాలు, వినియోగం లేని భవనాలు గుర్తించాలని చెప్పారు. ఖాళీగా ఉన్న స్థలాలను వెంటనే తీసుకోవాలని చెప్పారు. జేసీ కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ టిడ్కో గృహాలను కూడా డిసెంబరు 15 నాటికి టెండర్‌ ప్రక్రియ పూర్తి కావాలని చెప్పారు. వలంటీర్‌లు టిడ్కో లబ్ధిదారుల గృహాలకు వెళ్లి ప్రభుత్వం మంజూరు చేసిన లేఖలు అందజేయాలని చెప్పారు. డిసెంబరు 10 నాటికి జియో ట్యాగింగ్‌ పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారు ఫొటో కూడా మ్యాపింగ్‌ జరగాలని చెప్పారు. కార్యక్రమంలో జేసీ వెంకటరావు, డ్వామా, డీఆర్‌డీఏ  పీడీలు నాగేశ్వరరావు, సుబ్బారావు, ప్రత్యేక ఉపకలెక్టర్లు బాలా త్రిపుర సుందరి, సాల్మన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-20T04:46:52+05:30 IST