బహిరంగ చర్చకు సిద్ధం

ABN , First Publish Date - 2020-12-25T05:51:05+05:30 IST

రైతులకు అందిస్తున్న పథకాలపై జిల్లా స్థాయిలో బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు తెలిపారు.

బహిరంగ చర్చకు సిద్ధం

  

 ఎమ్మెల్యే శంబంగి

బొబ్బిలి:  రైతులకు అందిస్తున్న పథకాలపై జిల్లా స్థాయిలో బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు తెలిపారు. టీడీపీ నేతలు అన్నదాతల కష్టాలపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.  గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలే ఖర్లతో మాట్లాడుతూ..  ప్రస్తుతం నియోజకవర్గంలో రూ.98 కోట్ల  మేర ధాన్యం బిల్లులను  చెల్లించామన్నారు. ఈ ఏడాది  రైస్‌మిల్లు యజమాని వైఖరి కారణంగా కాస్త జాప్యం జరిగిందన్నారు. మెట్టవలసలో కొద్దిమంది రైతు లకు తప్ప ఇంకెవ్వరికీ బకాయిలు లేవని తెలిపారు.  ధరల స్థిరీకరణతో మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిం చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు.  ఈ సమా వేశంలో వైసీపీ నాయకులు  గోపాలరావు,  కృష్ణమూర్తి,  సత్యనారాయణ,  కృష్ణమూర్తి పాల్గొన్నారు.  రామభద్ర పురం: అర్హులందరికీ  ఇళ్లపట్టాలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే శంబంగి తెలిపారు.  మిర్తివలస గ్రామంలో  ఆయన పర్యటించారు. ఇళ్ల పట్టాలు తక్కువ మందికే కేటాయించారని, మిర్తివలసని రెవెన్యూ గ్రామంగా ప్రకటిం చాలని,  పెద్దగెడ్డ నుంచి పిల్లకాలువ నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరారు. నాయకులు ఏక్‌నాథ్‌, బాలకృష్ణ,  సాగర్‌,  సాయి,  చంద్రశేఖర్‌, సన్యాసిరావు పాల్గొన్నారు


 

Updated Date - 2020-12-25T05:51:05+05:30 IST