-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Precautions are mandatory
-
ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి
ABN , First Publish Date - 2020-12-07T04:38:56+05:30 IST
మలిదశలో కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు తగు జాగ్రత్తలతో విధులు నిర్వహించాలని డీఆర్‌డీఏ పీడీ కె.సుబ్బారావు కోరారు.

విజయనగరం (ఆంధ్రజ్యోతి) డిసెంబరు 6 : మలిదశలో కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు తగు జాగ్రత్తలతో విధులు నిర్వహించాలని డీఆర్‌డీఏ పీడీ కె.సుబ్బారావు కోరారు. ఆదివారం జిల్లా సమాఖ్య కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా సోకకుండా ఉండేందుకు కనీసం 50 రోజుల పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్క్ ధారణ, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వినియోగించాలని సూచించారు. అనంతరం 50 రోజుల ప్రణాళికకు సంబం ధించి సభ్యులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. మెడికల్ డిపార్ట్‌మెంట్ నుంచి పాల్గొన్న డాక్టర్ జగదీష్ పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ విషయా లను మహిళా సంఘాల సభ్యులు, ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ మేనేజర్, డీపీఎం, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.