పోలీసులే ఆప్తులై...

ABN , First Publish Date - 2020-11-27T05:20:26+05:30 IST

ఒడిశాకు చెందిన పార్వతీ అనే మహిళ మతిస్థిమితం లేకుండా గత కొద్ది రోజులుగా శృంగవరపుకోటలో సంచరిస్తోంది.

పోలీసులే ఆప్తులై...
మహిళను ఆసుపత్రికి తీసుకువెళ్తున్న పోలీసులు

మతిస్థిమితం లేని మహిళకు సాయం

శృంగవరపుకోట, నవంబరు 26: ఒడిశాకు చెందిన పార్వతీ అనే మహిళ మతిస్థిమితం లేకుండా గత కొద్ది రోజులుగా శృంగవరపుకోటలో సంచరిస్తోంది. నాలుగు రోజుల కిందట గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఆమె కాలికి తీవ్ర గాయమైంది. దీంతో నడవలేక స్థానిక దేవీబొమ్మ కూడలిలో అచేతనంగా పడి ఉంది. ఈ విషయం తెలుసుకున్న న్యాయవాది డబ్లూ.ఎన్‌ శర్మ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్‌.ఐ కె.నీలకంఠం స్థానిక కొలపర్తి నర్సింగ్‌ హోమ్‌కు చెందిన డాక్టర్‌ వరలక్ష్మిని సహాయంతో ఆసుపత్రిలో చేర్పించి ఉచితంగా వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల సహాయంతో విశాఖ పట్టణం తరలించారు. పోలీస్‌ల సేవాగుణాన్ని పలువురు ప్రసంసించారు.

Updated Date - 2020-11-27T05:20:26+05:30 IST