ప్రభుత్వ బడికి పీవో కుమారుడు

ABN , First Publish Date - 2020-11-26T04:32:10+05:30 IST

పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌.కూర్మనాథ్‌ తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. పార్వతీపురం పట్టణంలోని కేపీఎం హైస్కూల్‌లో 10వ తరగతిలో చేర్చేందుకు బుధవారం పీవో తన కుమారుడు త్రివిక్రమ్‌తో పాటు వెళ్లారు. ప్రవేశ దరఖాస్తును భర్తీ చేసి అందజేశారు.

ప్రభుత్వ బడికి పీవో కుమారుడు
కుమారుడు త్రివిక్రమ్‌ ప్రవేశ దరఖాస్తును భర్తీ చేస్తున్న ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌

 పాఠశాలలో చేర్పించిన ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌

పార్వతీపురం, నవంబరు 25 : పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌.కూర్మనాథ్‌ తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. పార్వతీపురం పట్టణంలోని కేపీఎం హైస్కూల్‌లో 10వ తరగతిలో చేర్చేందుకు బుధవారం పీవో తన కుమారుడు త్రివిక్రమ్‌తో పాటు వెళ్లారు. ప్రవేశ దరఖాస్తును భర్తీ చేసి అందజేశారు. గతంలో కూర్మనాథ్‌ చిత్తూరు, శ్రీకాకుళం, అనంతరం జిల్లాల్లో జిల్లా స్థాయి అధికారిగా విధులు నిర్వహించేవారు.  ఆ ప్రాంతాల్లోని   ప్రభుత్వ పాఠశాలల్లోనే తన కుమారుడిని చదివించారు. జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌-3గా పనిచేసిన సమయంలో కూడా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన లభిస్తుందని, అర్హత గల ఉపాధ్యాయులు ఉంటారని చెప్పారు. కార్పొరేట్‌ పాఠశాలలకు మించి నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే అందుతుందన్నారు. ఆ భావనతోనే  పనిచేసిన ప్రతిచోటా తన కుమారుని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నానని చెప్పారు. 


Read more