సమన్వయంతో విధులు నిర్వహించండి
ABN , First Publish Date - 2020-03-16T10:18:44+05:30 IST
ఎన్నికల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిజవహర్‌లాల్
ఆర్‌వోలు, ఏఆర్‌వోలకు శిక్షణ
పార్వతీపురం, మార్చి 15: ఎన్నికల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ అన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వివిధ మనస్తత్వం కలిగిన ఓటర్లు ఉంటారని, అధికారులు సహనంతో వారికి ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా సమయపాలన పాటించాలని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇబ్బందులు తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారులపైనే ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉప ఎన్నికల అధికారి, పార్వతీపురం సబ్ కలెక్టర్ టీఎస్ చేతన్, జిల్లా పంచాయతీ అధికారి సునీల్‌రాజ్‌కుమార్, సీపీవో విజయలక్ష్మి, పార్వతీపురం డివిజనల్ పంచాయతీ అధికారి సాయినాథ్, ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.