దరఖాస్తు చేసుకున్న ఐదు రోజులకే పింఛన్‌

ABN , First Publish Date - 2020-06-06T10:03:59+05:30 IST

లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల కే పింఛన్‌ అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని

దరఖాస్తు చేసుకున్న ఐదు రోజులకే పింఛన్‌

గజపతినగరం, జూన్‌ 5: లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల కే పింఛన్‌ అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎంపీడీవో కె.కిశోర్‌కుమార్‌ చెప్పారు. స్థానిక మండలపరిషత్‌ కార్యాలయంలో గ్రామ కార్య దర్శులు, వెల్‌ఫేర్‌ అసిస్టెంట్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పింఛన్‌ రానివారిని గుర్తించి, దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఈవోపీఆర్డీ జనార్దనరావు పాల్గొన్నారు. ఫ దత్తిరాజేరు: గ్రామాల్లో అర్హులైన పింఛన్‌దారులను వలంటీర్ల ద్వారా గుర్తించి దరఖాస్తు చేసుకునేవిధంగా సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలని ఎంపీడీవో ఎంవీ సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులు, వెల్‌ఫేర్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వ హించారు. కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ రవికుమార్‌, ఎంఈవో ఎం.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-06T10:03:59+05:30 IST