పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-11-26T05:41:07+05:30 IST

నిరుపేదల నోటికందాల్సిన పీడీఎస్‌ బియ్యం అధికమొత్తంలో అక్రమార్కుల చెంతన దర్శనమివ్వడంతో అధికారులు దాడి చే శారు.

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

కొత్తవలస రూరల్‌, నవంబరు 25: నిరుపేదల నోటికందాల్సిన పీడీఎస్‌ బియ్యం అధికమొత్తంలో అక్రమార్కుల చెంతన దర్శనమివ్వడంతో అధికారులు దాడి చే శారు. కొత్తవలస  మండలం వియ్యంపేటలో బుధవారం రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఎస్‌డీటీ మూర్తి విలేకరులతో మాట్లాడుతూ అక్ర మంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై తమకు అందిన ముందస్తు సమాచాంతోనే దాడులు నిర్వహించామన్నారు. విన్నకోట నాగేశ్వరరావు ఇంట్లో దాచి ఉంచిన సుమారు 1196 కేజీల పీడీఎస్‌ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో అధికధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న విషయాలను అధికారులు గుర్తించినట్లు తెలిపారు.  బియ్యాన్ని సీజ్‌చేసి, నిందితునిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు వివరించారు. పట్టుబడ్డ బియ్యాన్ని స్థానిక సివిల్‌సప్లై గోడౌన్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ సోదాల్లో ఎస్సై నరసింహమూర్తి పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-26T05:41:07+05:30 IST