సహనం, సమన్వయం అవసరం

ABN , First Publish Date - 2020-11-27T05:18:38+05:30 IST

అధికారంలో ఉన్న రాజకీయ నాయ కులకు, సమన్వయం అవసరమని బీజేపీ నాలుగు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ పెంట తిరుపతిరావు అన్నారు.

సహనం, సమన్వయం అవసరం
మాట్లాడుతున్న పెంట తిరుపతిరావు

పార్వతీపురంటౌన్‌, నవంబరు 26: అధికారంలో ఉన్న రాజకీయ నాయ కులకు, సమన్వయం అవసరమని బీజేపీ నాలుగు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ పెంట తిరుపతిరావు అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని 4వ వార్డులో నిర్మితమవుతున్న చిన్న ఆలయానికి సంబం ధించి అధికార పార్టీ నాయకులతో పాటు ఎమ్మెల్యే సమన్వయం పాటించాలన్నారు. ఆలయనిర్మాణం ఆగిపోవడంపై మున్సిపల్‌ అధికారులను మా నాయకుడు ప్రశ్నిం చడానికి వెళ్లాడే తప్ప ఎమ్మెల్యేను ఏ మాత్రం కించపరచాలని కాదని,  బీసీ సామాజి క వర్గాన్ని ఇప్పటికే ఈ నియోజకవర్గంలో కరివేపాకులా తీసిపారేస్తున్నందుకు బాధప డుతున్నానన్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి తన రక్షణ కోసం పోలీసుస్టేషన్‌లో శ్రీనివాసరావు ఫిర్యాదునిచ్చారే కానీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి చేస్తే తప్పకుండా అండగా ఉం టాం... వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు పుల్‌స్టాప్‌ పెట్టాలని బీజేపీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సుర గాల ఉమా, నాయకులు డి.శ్రీనివాసరావు, పి.భారతి,టి. శ్రీనివాసరావు, డి. సాయిపార్ధసారథి, ఆర్‌. దుర్గా, ఆర్‌. రమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T05:18:38+05:30 IST