పట్టణంలో మూడు ఆరోగ్య కేంద్రాలు
ABN , First Publish Date - 2020-07-06T10:15:13+05:30 IST
పట్టణంలో మూడు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు కానున్నట్లు ఎమ్మెల్యే అలజంగి జోగా రావు చెప్పారు.
పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు
పార్వతీపురం, జూలై 5: పట్టణంలో మూడు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు కానున్నట్లు ఎమ్మెల్యే అలజంగి జోగా రావు చెప్పారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లా డుతూ బెలగాం, కొత్తవలస, పార్వతీపురం పట్టణ కేంద్రాలు గా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాడతాయన్నారు. పట్టణంలో ఇప్ప టికే జగన్నాఽథపురంలో పట్టణ ఆరోగ్య కేంద్రం ఉందని, ఆరోగ్య కేంద్రాల పరిధిలో అందే వైద్య సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు మరో మూ డు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలకు సంబంధించి తాగునీటి సమస్య లేకుండా చేసేందుకు అవస రమైన చర్యలు తీసుకుంటున్నామని, రూ. 60 కోట్లతో త్వరలో తాగునీటికి సంబంఽ దించిన ఫైలట్ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.