కక్ష సాధింపు చర్యలు తగవు
ABN , First Publish Date - 2020-12-16T05:23:40+05:30 IST
టీడీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు తగవని టీడీపీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చింతలపేట గ్రామాన్ని మంగళవారం సందర్శించారు.
గుర్ల, డిసెంబరు 15: టీడీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు తగవని టీడీపీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చింతలపేట గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. గ్రామకంఠంపై జరిగిన వివాదాన్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పూర్వీకుల నుంచి గ్రామస్థుల ఆధీనంలో ఉన్న భూమిని లాక్కోవడం దారుణమన్నారు. ప్రజలను భావోద్వేగాలకు గురిచేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇదిలా ఉండగా గ్రామానికి వైసీపీ నాయకులు పతివాడ భాస్కరరావు, రామునాయుడు మహిళలతో కలిసి వెళ్లి నాగార్జున కారును ఆపారు. ఈ ప్రాంతంలో కొందరు టీడీపీ నేతలు పేదల కు పథకాలు అందకుండా చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. పోలీసులు సమక్షంలో దేశం నేతల కారులను పంపించారు. గుర్ల, గరివిడి, చీపురుపల్లి పార్టీ నేతలు సన్యాసినాయుడు, కిరణ్‌కుమార్, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.