తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి : ఎస్పీ
ABN , First Publish Date - 2020-11-16T03:49:59+05:30 IST
పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి అని ఎస్పీ రాజకుమారి తెలిపారు.

విజయగనరం (ఆంధ్రజ్యోతి) నవంబరు 15 : పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి అని ఎస్పీ రాజకుమారి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేచర్ చైల్డ్‌లైన్ ప్రత్యేకంగా రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆవిష్క రించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. చిన్నా రులకు నీతి కథలు, మంచి మాటలు చెప్పాలన్నారు. మొబైల్, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచాలని సూచించారు. బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. నెహ్రూ సేవలను కొనియాడారు. పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దుర్గ, రంజిత ఇతర సభ్యులు పాల్గొన్నారు.
పైడితల్లి ఆలయంలో పూజలు
విజయనగరం (క్రైం) : దీపావళి సందర్భంగా శనివారం సాయంత్రం వనం గుడివద్ద పైడితల్లమ్మ ఆలయంలో ఎస్పీ ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చిన్నారులతో కలిసి ముగ్గులు వేసి దీపాలు వెలిగించారు. బాలల దినోత్సవం నేపథ్యంలో పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వేద పండితులతో కలసి అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది రామారావు, రమణమూర్తి, తులసీరావు, అన్నపూర్ణమ్మ, లిఫ్టింగ్ సేవా సంస్థ ప్రతినిధులు కె.గౌరీశంకర్, ఎస్.అచ్చిరెడ్డి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పూర్వ సభ్యుడు కేసలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.