నిరుద్యోగులకు ఆన్‌లైన్‌ శిక్షణ

ABN , First Publish Date - 2020-06-26T11:52:09+05:30 IST

రాష్ట్ర నైపుణ్యాభివృద్థి సంస్థ, ఐబీఎం కంపెనీ సంయుక్తంగా డిగ్రీ, బీటెక్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు

నిరుద్యోగులకు ఆన్‌లైన్‌ శిక్షణ

విజయనగరం(ఆంధ్రజ్యోతి) జూన్‌ 25 : రాష్ట్ర నైపుణ్యాభివృద్థి సంస్థ, ఐబీఎం కంపెనీ సంయుక్తంగా డిగ్రీ, బీటెక్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు  జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీబీ సాయిశ్రీనివాస్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. డిజిటల్‌ ఫౌండేషన్‌, జూనియర్‌ వెబ్‌ డెవల ప్‌, కస్టమర్‌  సర్వీసు రిప్రంజెంటేటీవ్‌ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఏపీఎస్‌ఎస్‌డీసీ.ఇన్‌/హోం/స్కిల్‌బుల్డ్‌ఫ్రం అనే వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేష న్‌  చేసుకోవాలని సూచించారు.


నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఆన్‌లైన్‌ ద్వారా కొవిడ్‌-19పై శిక్షణ ఇస్తామన్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీనర్స్‌స్‌.యంగేడిన్‌సో. కాం/లాగిన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత సాధించిన వారికి అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా ధ్రువీకరణ పత్రం అందచేస్తామన్నారు. టెన్త్‌ నుంచి ఆపై చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్నవారికి ఆన్‌లైల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్‌ఎస్‌డీసీ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 18004252422 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. 

Updated Date - 2020-06-26T11:52:09+05:30 IST