ప్రతి మూడు కిలో మీటర్లకు ఒక డీఆర్‌ డిపో

ABN , First Publish Date - 2020-11-14T04:54:52+05:30 IST

గిరిజన ప్రాంతాల్లో ప్రతి మూడు కిలో మీటర్ల దూరానికి తప్పనిసరిగా ఒక డీఆర్‌ డిపో ఉండాలని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ జీసీసీ అధికారులను ఆదేశించారు.

ప్రతి మూడు కిలో మీటర్లకు ఒక డీఆర్‌ డిపో
మాట్లాడుతున్న పీవో

ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌

పార్వతీపురం, నవంబరు 13: గిరిజన ప్రాంతాల్లో ప్రతి మూడు కిలో మీటర్ల దూరానికి తప్పనిసరిగా ఒక డీఆర్‌ డిపో ఉండాలని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ జీసీసీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సివిల్‌ సప్లయ్‌ అధికారులు, జీసీసీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహి ంచారు. సబ్‌ప్లాన్‌ మండలాల్లో 10 నుంచి 15 కిలో మీటర్ల దూరంలో డీఆర్‌ డిపోలు ఉండడం వల్ల  గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిని పరిష్కరించాల్సిన అవసరం అధికార యంత్రాంగంపై ఉందన్నారు. కనీసం 125 రేషన్‌ కార్డులకు ఒక డీఆర్‌ డిపో చొప్పున మూడు కిలో మీటర్ల పరిధిలో ఈ డిపోలు ఉండాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గిరిజనులు రేషన్‌ తీసుకునే విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని స్పష్టం చేవారు. కార్యక్రమంలో జీసీసీ డీఎం రామ్మూర్తి, ఏఎస్‌వో లక్ష్మీనారాయణరెడ్డి, సీఎస్‌డీటీ నాగేశ్వరరావు, తదిత రులు పాల్గొన్నారు.ఫ ఐటీడీఏ పీవో ఆదేశాల ప్రకారం సబ్‌ప్లాన్‌ మండలాల్లో డీఆర్‌ డిపోలు పెరగనున్నాయి. ప్రస్తుతం 52,328 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 102 డీఆర్‌ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు గిరిజనులకు పంపిణీ చేస్తున్నారు. భవిష్యత్తులో సుమారు 98 డీఆర్‌ డిపోలు పెరిగే అవకాశం ఉంది.

Updated Date - 2020-11-14T04:54:52+05:30 IST