మహిళా గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2020-12-26T05:28:17+05:30 IST

మండలంలోని తాటిపూడి గురుకుల కళాశాలలో పార్ట్‌టైం, ఫుల్‌టైం తాత్కాలిక పద్ధతిలో పనిచేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇంచార్జి ప్రిన్సిపాల్‌ బి.చిరంజీవిరావు తెలిపారు.

మహిళా గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

శృంగవరపుకోట రూరల్‌, డిసెంబరు 25: మండలంలోని తాటిపూడి గురుకుల కళాశాలలో పార్ట్‌టైం, ఫుల్‌టైం తాత్కాలిక పద్ధతిలో పనిచేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇంచార్జి ప్రిన్సిపాల్‌ బి.చిరంజీవిరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇంగ్లిష్‌, కెమిస్ట్రీ, జువాలజీ, కామర్స్‌కోర్సుల బోధనకు అభ్యర్థులు కావాలన్నారు. దీనికి సంబంధించి సంబంధిత సబ్జెక్ట్‌నుంచి డిగ్రీలో 50శాతం మార్కులకు తగ్గకుండా ఉండాలని కోరారు. ఇతర వివరాలకు 98665 59729ను సంప్రదించాలని కోరారు.


Updated Date - 2020-12-26T05:28:17+05:30 IST