104 ఉద్యోగులకు వేతనాలు ఇవ్వరా..?
ABN , First Publish Date - 2020-04-25T10:58:38+05:30 IST
జిల్లా వ్యాప్తంగా 104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బం దికి తక్షణమే జీత భత్యాలు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి

బెలగాం, ఏప్రిల్ 24: జిల్లా వ్యాప్తంగా 104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బం దికి తక్షణమే జీత భత్యాలు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరా మ్మూర్తి శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆకలిపస్తులతో కరోనా విధు లు నిర్వహిస్తున్న 104 వైద్య సిబ్బందిని ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన ఆరోపించారు. గత మూడు నెలలుగా జీతాలు, 9 నెలలుగా టీఏ, డీఏలను ప్రభు త్వం బకాయి పడిందని, ఇలా అయితే వారు కుటుంబాలతో జీవనం ఎలా సాగిం చగలరని ఆయన మండిపడ్డారు. వెంటనే జీతంతో పాటు తొమ్మిది నెలల వేతన భత్యాలు తక్షణమే చెల్లించాలని ఆయన కోరారు.