-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Nirvana Silence
-
నిర్మానుష్యం.. నిశ్శబ్దం!
ABN , First Publish Date - 2020-03-23T09:48:17+05:30 IST
విశాఖపట్నం- కోరాపుట్ (డీఎంయూ), విజయవాడ - రాయగడ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచి పోయాయి. విశాఖ నుంచి రాయగడ వెళ్లే పాసింజర్ రైలు నిలిచి పోయింది. సోమవారం నుంచి

జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. జనాలు స్వచ్ఛంగా ఇందులో పాల్గొన్నారు. పట్టణాలు, గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి.
గజపతినగరం: విశాఖపట్నం- కోరాపుట్ (డీఎంయూ), విజయవాడ - రాయగడ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచి పోయాయి. విశాఖ నుంచి రాయగడ వెళ్లే పాసింజర్ రైలు నిలిచి పోయింది. సోమవారం నుంచి ఈరైళ్లు యథావిధిగా నడవ ను న్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పలు పాసింజర్ రైళ్లు నిలిచిపోవడంతో కోమటి పల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికులు లేక బోసిపోయి కనిపించింది. స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి భగద్గీత శ్లోకాలు పఠించారు.
రాష్ట్ర ప్రజలు కాపాడాలని కో రారు. ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణి, పట్టణ వా సులు సాయంత్రం తమ ఇళ్ల వాకిటకు వచ్చి చప్పట్లతో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాలూరు నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది.
దుబాయి నుంచి వచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలు
సాలూరు రూరల్: దుబాయి నుంచి సాలూరు ప్రాంతానికి వచ్చిన ఓ వ్యక్తికి ( 34)కు మా మిడిపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి రెడ్డి శ్రీనివాసరావు వైద్య పరీక్షలు చేశారు. ఆదివారం 14 రోజుల పాటు పర్యవేక్షిస్తామని తెలిపారు.
బొబ్బిలి : బొబ్బిలి పట్టణంలో అన్ని ప్రధాన వీధులు నిర్మానుష్యమయ్యాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చి బొబ్బిలిలో చిక్కుకుపోయిన వారిని ఆటోల్లో వారి స్వగ్రామాలకు తరలించారు.
రామభద్రపురం: ఆంధ్రా-ఒడిశా వ్యాపారులు, రైతులతో కూరగాయల విక్రయాలతో రద్దీగా ఉండే స్థానిక కూరగాయల మార్కెట్, ఆర్టీసీబస్టాండ్, రోడ్లు జనాలులేక బోసిపోయాయి. సాయంత్రం 5 గంటలకు గోబ్యాక్ కరోనా అంటూ ఆరికతోట గ్రామస్థులు చప్పట్లు చరిచారు.
పార్వతీపురం/ రూరల్/ కురుపాం/ రూరల్/ గుమ్మలక్ష్మీపురం : పార్వతీపురం, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి, తదితర మండలాల్లో కర్ఫ్యూను ప్రజలు స్వచ్ఛందంగా పాటించారు.
పెట్రోల్ బంకులు బంద్
పార్వతీపురం పట్టణంలోని పెట్రోల్ బంకులు మూసివేశారు. హోటల్స్‌ను బంద్ చేశారు. వ్యాపార వర్గాలు పూర్తిస్థాయిలో సహకారం అందించారు. పార్వతీపురం ఏరియా ఆసుపత్రితో పాటు కురుపాం, చినమేరంగి, భద్రగిరి సీహెచ్‌సీలతో పాటు పీహెచ్‌సీల్లో వైద్య సిబ్బంది సేవలందించారు.
డిపోలకే పరిమితమైన బస్సులు
జనతా కర్ఫ్యూతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మికులు కర్ఫ్యూకు మద్దుతు పలికారు.
ప్రజారోగ్యసేవలు భేష్
విజయనగరం టౌన్: జనతాకర్ఫ్యూలో భాగంగా నగరంలో ఆదివారం పట్టణ ప్రజారోగ్యశాఖ సిబ్బంది చక్కగా సేవలందించారు. నగరంలో ఉన్న 50 డివిజన్లలో ఎప్పటికప్పుడు చెత్తనుతొలగించారు. అన్ని వార్డుల్లోనూ బ్లీచింగ్, కరోనా నిరోధక ద్రావణాన్ని అగ్నిమాపక వాహనాల ద్వారా చల్లించారు. పట్టణ ప్రజారోగ్యశాఖ అధికారి ప్రణీత పర్య వేక్షణలో 450మంది ఈ పనుల్లో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ వాహనాల సూపర్‌వైజర్ బాలకష్ణ తదితరులు పాల్గొన్నారు.
మాస్కులు పంపిణీ
కరోనా నిరోధక చర్యల్లో భాగంగా మాస్కులను కెఎల్ పురానికి చెందిన వైసీపీ నేత తాళ్లపూడి సంతోషికుమారి ఇంటింటికీ వెళ్లి మాస్కులను శనివారం రాత్రి పంపిణీ చేశారు.