ప్రకృతి వ్యవసాయమే లాభదాయకం

ABN , First Publish Date - 2020-12-21T04:14:14+05:30 IST

ప్రకృతి వ్యవసాయ విధానాలను అలవర్చుకుంటే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని రాష్ట్ర సాంస్కృతిక, క్రియేటివ్‌ చైర్మన్‌ వంగపండు ఉష, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. ఆదివారం తోటపల్లిలో వినాయకస్వామి అర్థ శతాబ్ధి ఉత్సవాల్లో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రసాయనిక ఎరువులు వినియోగంతో రోగాలబారిన పడుతున్న పరిస్థితి నెలకొందని, ఆహార ఆరోగ్య భద్రతకు రైతు భరోసా కేంద్రాల్లో అవసరమైన సేంద్రియ సామగ్రిని అందుబాటులోకి తెచ్చారన్నారు.

ప్రకృతి వ్యవసాయమే లాభదాయకం
సేంద్రియ సాగు విధానాన్ని తెలుసుకుంటున్న ఎంపీ బెల్లాన





గరుగుబిల్లి : ప్రకృతి వ్యవసాయ విధానాలను అలవర్చుకుంటే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని రాష్ట్ర సాంస్కృతిక, క్రియేటివ్‌ చైర్మన్‌ వంగపండు ఉష, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. ఆదివారం తోటపల్లిలో వినాయకస్వామి అర్థ శతాబ్ధి ఉత్సవాల్లో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రసాయనిక ఎరువులు వినియోగంతో రోగాలబారిన పడుతున్న పరిస్థితి నెలకొందని, ఆహార ఆరోగ్య భద్రతకు  రైతు భరోసా కేంద్రాల్లో అవసరమైన సేంద్రియ సామగ్రిని అందుబాటులోకి తెచ్చారన్నారు. రైతులకు అందుబాటులో ఉండే వాటితో తయారు చేసుకుని ఉపయోగించుకుంటే అధిక దిగుబడితో పాటు వ్యయం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో జట్టు సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ డి.పారినాయుడు, కో-ఆర్డినేటర్‌ ఎం.నూకంనాయుడు, ఎస్‌డీఏ జి.అన్నపూర్ణ, రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-21T04:14:14+05:30 IST