మానవత్వంతో ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-11-20T05:17:19+05:30 IST

ఆపదలో ఉన్నవారిని మానవత్వంతో ఆదుకోవాలని పట్ట ణ ఎస్‌ఐ జి. కళాధర్‌ అన్నారు.

మానవత్వంతో ఆదుకోవాలి

పార్వతీపురంటౌన్‌, నవంబరు 19: ఆపదలో ఉన్నవారిని మానవత్వంతో ఆదుకోవాలని పట్ట ణ ఎస్‌ఐ జి. కళాధర్‌ అన్నారు. పట్టణంలోని రామాపురం కాలనీకి చెందిన వర్రి శంకరరావు పురిళ్లు అగ్నిప్రమాదానికి గురవడంతో పట్టణ పోలీసుస్టేషన్‌ హెచ్‌సీ కృష్ణమూర్తి తన డబ్బులతో కొనుగోలు చేసిన బియ్యం, నిత్యావసర వస్తువులను ఎస్‌ఐ చేతుల మీదుగా అందజేశారు. జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మోనటరింగ్‌ సెల్‌ సభ్యుడు బి. రామ కృష్ణ బాధిత కుటుంబానికి బట్టలు పంపిణీ  చేశారు. కార్యక్రమంలో 30వ వార్డు వైసీపీ నాయకులు రణభేరి చిన్నంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-20T05:17:19+05:30 IST