జవాబుదారీతనం ఉండాలి!

ABN , First Publish Date - 2020-12-14T04:57:18+05:30 IST

ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులకు జవాబుదారీతనం ఉండాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ ఆర్‌.శ్రీనివాసరావు తెలిపారు.

జవాబుదారీతనం ఉండాలి!
రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్‌కు ఆహ్వానం పలుకుతున్న జేసీ తదితరులు

 ఆర్‌టీఏ పరిధిలో సచివాలయ సిబ్బంది

  సమాచార హక్కు చట్టం కమిషనర్‌ శ్రీనివాసరావు వెల్లడి

విజయనగరం (ఆంధ్రజ్యోతి), డిసెంబరు 13: ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులకు జవాబుదారీతనం ఉండాలని  రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ ఆర్‌.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన  జడ్పీ అతిథి గృహానికి చేరుకున్నారు.   కమిషనర్‌ను  జేసీ కిషోర్‌కుమార్‌, డీఆర్‌వో గణపతిరావు, ఆర్‌డీవో భవానీ శంకర్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.  ఆర్‌టీఏ కింద అందిన దరఖాస్తుల  గురించి  జేసీ కిషోర్‌కుమార్‌ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  సచివాలయ సిబ్బంది కూడా ఆర్‌టీఏ పరిధిలో ఉండాలన్నారు. తన పర్యటనకు ముందుగా పీఐవో, ఏపీఐవో, ఐవోలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సమాచార హక్కు చట్టం కింద అందే దరఖాస్తులను అధికారుల వద్దే పరిష్కారం కావాలని, అప్పుడే కమిషన్‌కు వచ్చే అర్జీల సంఖ్య తగ్గుతుందని తెలిపారు.  జడ్పీ అతిఽథి గృహంలో బస చేసిన ఆయన ఎమ్మెల్యే కోలగట్లను కలిసి కాసేపు చర్చించారు. ఈ నెల 19 వరకూ జిల్లాలో పర్యటించి కమిషన్‌కు అందిన దరఖాస్తులపై కలెక్టరేట్‌లో ఆయన విచారించనున్నారు. 


 


 

Updated Date - 2020-12-14T04:57:18+05:30 IST