మున్సిపాలిటీ వర్సెస్‌ పోలీసు

ABN , First Publish Date - 2020-12-02T05:27:06+05:30 IST

హెల్మెట్‌ ధరించలేదని మున్సిపల్‌ కమిషనరుకు పోలీసులు ఫైన్‌ వేయడంతో ఆగ్రహించిన మున్సిపల్‌ వాటర్‌వర్క్స్‌ సిబ్బంది స్థానిక పోలీసు క్వార్టర్స్‌కు నీటి సరఫరాను బంద్‌ చేశారు. ఈ వివాదం చినికిచిని కి గాలివానలా మారింది.

మున్సిపాలిటీ వర్సెస్‌ పోలీసు

కమిషనరుకు ఫైన్‌ వేయడంతో పోలీసు క్వార్టర్స్‌కు నీటిసరఫరా బంద్‌
బొబ్బిలి, డిసెంబరు 1:
హెల్మెట్‌ ధరించలేదని మున్సిపల్‌ కమిషనరుకు పోలీసులు ఫైన్‌ వేయడంతో ఆగ్రహించిన మున్సిపల్‌ వాటర్‌వర్క్స్‌ సిబ్బంది స్థానిక పోలీసు క్వార్టర్స్‌కు నీటి సరఫరాను బంద్‌ చేశారు. ఈ వివాదం చినికిచిని కి గాలివానలా మారింది. 12 రోజులుగా  క్వార్టర్స్‌కు  తాగునీటి సరఫరా నిలిచి పోవడంతో మరమ్మతు చేయించాలని కోరినప్పటికీ స్పందించకపోవడంతో ప్రైవేట్‌ వర్కర్లను పెట్టి పోలీసులు మరమ్మతు చేయించుకున్నారు. పైపులైనుకు ఉద్దేశ పూర్వకంగానే మున్సిపల్‌ సిబ్బంది అంతరాయం కలిగించారని తెలుసుకున్న పోలీ సులు ఆ సిబ్బందిని గట్టిగా నిలదీసి పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తుండగా డీఈఈ సురేష్‌, ఏఈ షమీమ్‌లో మంగళవారం సాయంత్రం స్టేషన్‌కు చేరు కున్నారు. అదే సమయంలో కమిషనరు నాయుడు వచ్చి సీఐతో గొడవపడ్డారు. తప్పు చేసిన సిబ్బందిపై కేసు కడతామని సీఐ చెప్పడంతో కమిషనరు ఆగ్రహించి తాము కూడా చట్ట ప్రకారం నడుచుకోవాల్సి వస్తుందని చెప్పి అక్కడ నుంచి వెళ్లి పోయారు. దీనిపై కమిషనరు నాయుడును అడగ్గా తమ సిబ్బంది తప్పు చేసి ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అలా కాకుండా కేసు కడతామంటే ఎలా? అని అన్నారు. సీఐ కేశవరావును అడగ్గా ఉద్దేశపూర్వకంగానే పైపులైనుకు అంత రాయం కలిగించినట్లు సిబ్బంది అంగీకరించారని, ఈ విషయమై డీఈఈ, ఏఈలతో సానుకూలంగా చర్చిస్తుండగా కమిషనరు వచ్చి వివాదాన్ని పెద్దది చేసి వెళ్లిపోయారన్నారు. ఇందుకు సంబంధించి ఎవరిపైనా ఎటువంటి కే సు నమోదు చేయలేదని, మా రెండు శాఖల మధ్య అంతర్గత వ్యవహారమని సీఐ తెలిపారు.

Updated Date - 2020-12-02T05:27:06+05:30 IST