పేదల సంక్షేమానికి పెద్దపీట
ABN , First Publish Date - 2020-05-24T08:31:02+05:30 IST
రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు.

ఎంపీ బెల్లాన చంద్రశేఖర్
చీపురుపల్లి, మే 23: రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పతివాడ రాజారావు, ఎల్. ప్రభాత్‌కుమార్, బొంతు తిరుపతి, ఇప్పిలి తిరుమల, చందక గురునాయుడు, గొర్లె శ్రీరాములునాయుడు తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి: ఏడాది పాలనలో సీఎం జగన్ ఎన్నో అద్భుతాలు సాధించారని ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల నియామకంతో విప్లవాత్మక పరిపాలనకు శ్రీకారం చుట్టారన్నారు. తొలుత లచ్చయ్యపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు. స్థానిక ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఇంటి గోపాలరావు, సావు కృష్ణమూర్తి, భమిడిపాటి విశ్వనాథశర్మ, సావు మురళి, దిబ్బ గోపి తదితరులు పాల్గొన్నారు.
సాలూరు/రూరల్: వైసీపీ విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే రాజన్నదొర తన నివాసంలో దివంగత నేత వైఎస్సార్, సీఎం జగన్‌ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. పట్టణంలో బొసుబొమ్మ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వైసీపీ నేతలు జరజాపు ఈశ్వరరావు, పువ్వల నాగేశ్వరరావు, జరజాపు సూరిబాబు, పి.రామకృష్ణ, మాధవరావు, గిరి రఘు, రాంబాయి పాల్గొన్నారు. ఫ సాలూరు రూరల్: మామిడిపల్లిలో పార్టీ మండల అధ్యక్షుడు సువ్వాడ రమణ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కేక్ కట్ చేశారు. సువ్వాడ తవుడు, దండి శ్రీనివాసరావు, ఎస్‌టీపీ రాజు, పొట్నూరి రమణ తదితరులు పాల్గొన్నారు. బాగువలసలో రెడ్డి పద్మావతి, సురేష్, తిరుపతినా యుడు తదితరుల ఆధ్వర్యంలో విక్టరీ డే వేడుకలు జరిగాయి.
మక్కువ: స్థానిక పద్మశ్రీ థియేటర్‌లో వైసీపీ మండల నాయకుడు మావుడి రంగునాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఏడాది విజయోత్సవ సంబరాలు చేశారు. వైసీపీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నాయ కులు టి.సుబ్బరాజు, పన్నా డ కృష్ణ, కోట్ల నారాయ ణరావు, గోపి పాల్గొన్నారు.
మెరకముడిదాం : గర్భాం, మెరకముడిదాం పీహెచ్‌సీ కేంద్రంలో రోగు లకు, మోడల్ పాఠశాల లోని క్వారంటైన్ కేంద్రంలో ఉన్న వారికి వైసీపీ నేతలు పండ్లు, రొట్టెలు అందించారు. డీసీఎంఎస్ చైర్మన్ ఎస్‌వీ రమణరాజు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల విశ్వేశ్వరరావు, తాడ్డి వేణుగోపాలరావు, నేతలు బూర్లె నరేష్‌కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గ్గొన్నారు. ఫ బలిజిపేట: వైసీపీ ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ పాలవలస మురళీకృష్ణ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెలిది సాయిరాం, మజ్జి శ్రీరామ్మూర్తి, బోనంగి తమ్మినాయుడు, శంబాన భాస్కరరావు పాల్గొన్నారు.
కొత్తవలస: కొత్తవలసలోని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు ఆధ్వర్యంలో వైసీపీ ఏడాది విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం రజక, నాయిబ్రాహ్మణులకు నిత్యావసరాలు అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొంతల వెంకటరావు, మోపాడ పెంటాజీ, రామన్నపాత్రుడు, కర్రి శ్రీను పాల్గొన్నారు.
వేపాడ: వైసీపీ ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా మాజీ ఎంపీపీ వెంకట చినరామునా యుడు బక్కునాయుడుపేటలోని పునరావాస కేంద్రం లోని వలసకూలీలకు పాలు, బిక్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సత్యనా రాయణ, శనాపతి అప్పారావు, చలుమూరి పద్మావతి, తహసీల్దార్ డి.వి. రమణ, ఈవోపీఆర్డీ రవికుమార్ పాల్గొన్నారు.
నెల్లిమర్ల/భోగాపురం/ పూస పాటిరేగ: రాష్ట్రంలో వైసీపీ అధికారంలో వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో విజయోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్లెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చేతుల మీదుగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంబళ్ల శ్రీరాములునాయుడు, చనమల్లు వెంకటరమణ, భోగాపురం వైసీపీ నాయకులు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, సుందర గోవిందరావు, బైరెడ్డి ప్రభాకరరెడ్డి, పూసపాటిరేగ మండల నాయ కులు పతివాడ అప్పలనాయుడు, పిన్నింటి వెంకట రమణ, జనార్దనరావు, శ్రీనివాసరావు, పాల్గొన్నారు.