పెనుమత్స ఆదర్శనీయుడు : ఎంపీ బెల్లాన
ABN , First Publish Date - 2020-08-12T10:19:21+05:30 IST
ఉత్తరాం ధ్రలో ఎంతోమంది నాయకులను తయారుచేసిన కురువృద్ధుడు పెనుమత్స సాంబశివరాజు ఆదర్శ నీయుడని, ఆయన మృతి పార్టీకి తీరని ..

గుర్ల, ఆగస్టు 11 : ఉత్తరాం ధ్రలో ఎంతోమంది నాయకులను తయారుచేసిన కురువృద్ధుడు పెనుమత్స సాంబశివరాజు ఆదర్శ నీయుడని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్ అన్నారు. మంగళవారం కెల్ల జంక్షన్ వద్ద ఉత్తరాంధ్ర విద్యార్థి సేన అధ్యక్షుడు సుంకరి రమణ మూర్తి ఆధ్వర్యంలో సాంబశివ రాజు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్త రాంధ్ర ప్రాంతంలో ఎంతోమందిని నాయకులుగా తీర్చిదిద్ధిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. విజయనగరం సహకార బ్యాంకు మాజీ చైౖర్మన్ చనుమల్ల వెంకటరమణ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల్లో బడిగుడి నీరు సాగు, తాగునీరు, ఆసుపత్రులు, రోడ్లు తదితర వాటిని పూర్తి చేసిన ఘనత సాంబశివరాజుకు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగాన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.