పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
ABN , First Publish Date - 2020-11-28T03:55:13+05:30 IST
ప్రేమించాను..పెళ్లి చేసుకుంటానని ఆ బాలికను నమ్మించాడు. సన్నిహితంగా మెలిగాడు. ఇప్పుడు గర్భవతి కావడంతో తనకు సంబంధం లేదని తెగేసి చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
బాలికను గర్భవతి చేసిన యువకుడు
దత్తిరాజేరు, నవంబరు 27:
ప్రేమించాను..పెళ్లి చేసుకుంటానని ఆ బాలికను నమ్మించాడు. సన్నిహితంగా మెలిగాడు. ఇప్పుడు గర్భవతి కావడంతో తనకు సంబంధం లేదని తెగేసి చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దత్తిరాజేరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగుచూసిందీ ఘటన. గ్రామానికి చెందిన బాలిక (16) ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. బాధిత కుటుంబసభ్యులు ఆమెను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.బూర్జివలస ఎస్ఐ బి.భాగ్యం తెలిపారు.