పైడితల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స

ABN , First Publish Date - 2020-10-27T18:09:53+05:30 IST

జిల్లాలో శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాల సందర్భంగా మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అమ్మవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

పైడితల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స

విజయనగరం: జిల్లాలో శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాల సందర్భంగా మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అమ్మవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బొత్సకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆపై ప్రత్యేక పూజలు నిర్వహించారు.


మంత్రి బొత్స మాట్లాడుతూ...పైడితల్లి అమ్మవారి జాతరను ప్రతి సంవత్సరం లాగే సాంప్రదాయంగా నిర్వహిస్తున్నామన్నారు. అందరు ఆరోగ్యంగా ఉండాలని పూజించానని చెప్పారు. సకాలంలో వర్షాలు పడి, రైతులు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. 
అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని

పైడితల్లి అమ్మవారిని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. స్పీకర్‌కు ఆలయ అధికారులు  పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం తమ్మినేని సీతారాం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2020-10-27T18:09:53+05:30 IST