మంత్రి బొత్సకు మంత్రుల పరామర్శ

ABN , First Publish Date - 2020-08-18T12:50:52+05:30 IST

మునిసిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను రాష్ట్ర మంత్రులు..

మంత్రి బొత్సకు మంత్రుల పరామర్శ

దాసన్నపేట(విజయనగరం): మునిసిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను రాష్ట్ర మంత్రులు ఆయన నివాసంలో సోమవారం పరామర్శించారు. బొత్స తల్లి ఈశ్వరమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందడం విదితమే. ఈ విషయం తెలిసి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, సమాచార పౌర సంబంధాలు, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, పాడి పరిశ్రమల, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, విజయ నగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, రాజాం, పాలకొండ ఎమ్మెల్యేలు   జోగులు, కళావతి,  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, శ్రీకాకుళం  డీసీసీబీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌, వైసీపీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త చిన్న శ్రీను తదితరులు బొత్సను పరామర్శించారు. ఈశ్వరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 


జిల్లా శిష్టకరణాల సంఘం ప్రధాన కార్యాదర్శి ఎంపీజీ ఈశ్వరావు కూడా సంతాపం తెలిపారు. ఎంతోమంది పేదలకు బొత్స ఈశ్వరమ్మ అండగా నిలిచి, సహాయ సహకారాలు అందించారన్నారు.  


Updated Date - 2020-08-18T12:50:52+05:30 IST