మునిసిపాలిటీల్లో కొళాయిలకు మీటర్లు..!

ABN , First Publish Date - 2020-04-21T06:25:48+05:30 IST

జిల్లాలో మున్సిపల్‌ ప్రాంతాల్లో కొళాయిలకు మీటర్లు ఏర్పాటు చేసేందుకు అవకాశముందని పబ్లిక్‌ హెల్త్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ బీహెచ్‌ శ్రీనివాస్‌ చెప్పారు. సోమవారం ఆయన సాలూరు మున్సిపల్‌ కార్యాలయంలో...

మునిసిపాలిటీల్లో కొళాయిలకు మీటర్లు..!

 సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 20: జిల్లాలో మున్సిపల్‌ ప్రాంతాల్లో కొళాయిలకు మీటర్లు ఏర్పాటు చేసేందుకు అవకాశముందని పబ్లిక్‌ హెల్త్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ బీహెచ్‌ శ్రీనివాస్‌ చెప్పారు. సోమవారం ఆయన సాలూరు మున్సిపల్‌ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. రూ.254.95 కోట్లతో సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, నెలిమర్లల్లో ఆసియా ఇన్‌ఫ్రాస్టక్చర్‌ బ్యాంకు రుణంతో తాగునీరు పథకాలను ఏర్పాటు చేస్తున్నా రని చెప్పారు. ఈ పథకంలో భాగంగా ఇంటింటికీ కొళాయిలు అందిం చడంతో పాటు మీటర్లు బిగిస్తామన్నారు. అలాగే సాలూరులో పూడిక తీత పనులు, ఇతర పనులపై ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ శేఖర్‌తో ఆయన సమీక్షించారు.

Updated Date - 2020-04-21T06:25:48+05:30 IST