పోలీసులకు సేవా పతకాలు

ABN , First Publish Date - 2020-12-18T05:12:11+05:30 IST

జిల్లా పోలీస్‌ శాఖలో సుదీర్ఘకాలం ఎటువంటి రిమార్కులు లేకుండా పనిచేసిన పోలీస్‌ అధికారులు, సిబ్బందికి 2018-19 గాను ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట పతకాలకు కేంద్ర హోం శాఖ ఎంపిక చేసింది.

పోలీసులకు సేవా పతకాలు





విజయనగరం (క్రైం)/కొత్తవలస/బొబ్బిలి, డిసెంబరు 17 : జిల్లా పోలీస్‌ శాఖలో సుదీర్ఘకాలం ఎటువంటి రిమార్కులు లేకుండా పనిచేసిన పోలీస్‌ అధికారులు, సిబ్బందికి 2018-19 గాను ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట పతకాలకు కేంద్ర హోం శాఖ ఎంపిక చేసింది. ఈ మేరకు వారికి డీజీపీ సంతకం చేసిన ప్రశంసా పత్రాలను గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజకుమారి ప్రదానం చేశారు. 

 అతి ఉత్కృష్ట పతకం పొందినవారు ...

 సీసీఎస్‌ ఎస్‌ఐ రాజారావు, పోలీస్‌ కంట్రోల్‌ రూం ఏఎస్‌ఐ అప్పారావు,  కొత్తవలస సీఐ జి.గోవిందరావు, క్లూస్‌టీంలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న ఎస్వీ రమణ రాజు, ఏస్బీ ఏఎస్‌ఐ విక్రమరావు, భోగాపురం ఏఎస్‌ఐ నర్సింగరావు, ఆండ్ర ఏఎస్‌ఐ పోలినాయుడు, ఏఎఆర్‌లో పనిచేస్తున్న  కేవీ రమణ, ఎం.గోవింద్‌రావు, టీవీ రాజు ఉన్నారు.

 ఉత్కృష్ట పతకం పొందినవారు...

ఎస్‌బీ హెచ్‌సీ, పోలీస్‌ పీఆర్వోగా పనిచేస్తున్న  పీవీఎస్‌ఎస్‌ కోటేశ్వరావు, నెల్లిమర్ల హెచ్‌సీ సురేష్‌బాబు, వన్‌టౌన్‌ హెచ్‌సీ ఆనందరావు, బొబ్బిలి హెచ్‌సీ మురళీకృష్ణ, టూటౌన్‌ హెచ్‌సీ బి.శ్రీనివాసరావు, సీసీఎస్‌ హెచ్‌సీ రాజేశ్వరావు, పాచిపెంట హెచ్‌సీ వరప్రసాద్‌రావు, రామభద్రపురం హెచ్‌సీ వెంకటరమణ, క్లూస్‌టీం హెచ్‌సీ కృష్ణ, నెల్లిమర్ల హెచ్‌సీ శోభారాణి, ఏఆర్‌ హెచ్‌సీలు జగదీశ్వరరావు, సునీల్‌కుమార్‌, శ్రీనివాసరావు, దంతేశ్వరరావు, ఈశ్వరరావు, రవి, కురుపాం హెచ్‌సీ సంగమేశ్వరరావు, డీసీఆర్‌బీలో పనిచేస్తూ ఇటీవల మృతి చెందిన హెచ్‌సీ రామకృష్ణ ఉన్నారు. 

 

Updated Date - 2020-12-18T05:12:11+05:30 IST