రామతీర్థం అభివృద్ధికి చర్యలు: ఎమ్మెల్యే బడ్డుకొండ

ABN , First Publish Date - 2020-09-05T09:17:14+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం అభివృద్ధికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారు...

రామతీర్థం అభివృద్ధికి చర్యలు: ఎమ్మెల్యే బడ్డుకొండ

నెల్లిమర్ల, సెప్టెంబరు 4: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం అభివృద్ధికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారు. దేవస్థానం సమీపంలోని దుర్గగుడికి వచ్చే భక్తుల కోసం రామతీర్థం సేవా సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన విశ్రాంతి శాల నిర్మాణానికి ఆయన శుక్రవారం భూమి పూజ చేశారు. సేవా సంఘం గౌరవాధ్యక్షుడు చనమల్లు వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రామతీర్థం సేవా సంఘం ప్రతినిధులకు అభినందించారు. కార్యక్రమంలో సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రేగాన గోవిందరావు, సుదర్శనం విజయ్‌కుమార్‌, తర్లాడ దుర్గారావు, పిన్నింటి శ్రీనివాసరావు, అప్పలనాయుడు పాల్గొన్నారు.


చెత్తబుట్టల పంపిణీ  

సీతారామునిపేట గ్రామస్థులకు ఎమ్మెల్యే బడ్డుకొండ శుక్రవారం చెత్తబుట్టలను పంపిణీ చేశారు. వీటిని విజయనగరానికి చెందిన నాయుడు పైప్స్‌ దుకాణం యజమాని, రామతీర్థానికి చెందిన సుదర్శనం విజయ్‌కుమార్‌ సమకూర్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు రేగాన శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌ రాంబార్కి రామారావు, పంచాయతీ కార్యదర్శి అనూష పాల్గొన్నారు.

Updated Date - 2020-09-05T09:17:14+05:30 IST