పునరావాస కల్పనకు చర్యలు
ABN , First Publish Date - 2020-12-12T05:19:29+05:30 IST
తోటపల్లి ప్రాజెక్టులో ముం పునకు గురైన సుంకి నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
గరుగుబిల్లి, డిసెంబరు 11: తోటపల్లి ప్రాజెక్టులో ముం పునకు గురైన సుంకి నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం నిర్వా సితుల సమాచారాన్ని మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జి.శ్రీనివాసరావు, సర్వేయర్ బి.శ్రీనివాసరావు, వీఆర్‌వో పి.రామకృష్ణతో పాటు పలు వురు సేకరించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ముందుగా 250 మందికి అవసరమైన నివాస స్థల పట్టాలను అందించామని, పునరావాస కల్పనకు తులసి రామినాయుడువలస ప్రాంతంలో స్థల సేకరణ చేయడంతో పాటు లేఅవుట్లుగా వేశామన్నారు. ఈ పరిశీలనలో సర్వే సిబ్బంది సింహాచలం, ఎస్.శ్రీనివాసరావు, జి.కృషా ్ణరావు, తదితరులు ఉన్నారు.