వివాహాలను రద్దు చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-03-28T07:12:34+05:30 IST

గ్రామాల్లో వివాహాలు జరిపేందుకు ముహూర్తాలు ఖరారు చేసుకున్న వారు రద్దు చేసుకోవాలని అధికారులు అవగాహన

వివాహాలను రద్దు చేసుకోవాలి

గరుగుబిల్లి, మార్చి 27: గ్రామాల్లో వివాహాలు జరిపేందుకు ముహూర్తాలు ఖరారు చేసుకున్న వారు రద్దు చేసుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. శుక్రవారం మండలంలోని పెద్దూరు గ్రామంలో వివాహ కార్యక్రమానికి సన్నద్ధమవుతున్న తరుణంలో మూకుమ్మడిగా ఉండకుండా ఉండేలా ఎస్‌ఐ వై.సింహాచలంతో పాటు వైద్య సిబ్బంది అవసరమైన చర్యలు చేపట్టారు. గ్రామాల్లోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినట్లయితే సమాచారం అందించాలని, బయట వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చినట్లయితే శుభ్రపర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు. 

Updated Date - 2020-03-28T07:12:34+05:30 IST