రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-08-22T09:12:59+05:30 IST

బైకు అదుపుతప్పి యువకుడు మృతి చెందిన సంఘటన గొబ్యాం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పెదమానాపురం ఎస్‌ఐ పి.రమేష్‌నాయుడు తెలి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

దత్తిరాజేరు, ఆగస్టు 21: బైకు అదుపుతప్పి యువకుడు మృతి చెందిన సంఘటన గొబ్యాం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పెదమానాపురం ఎస్‌ఐ పి.రమేష్‌నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. గొబ్యాం గ్రామానికి చెందిన వైకుంఠపు చందు(19) మొరకముడిదాం మండలం గర్బాం గ్రామంలో కూరగాయలను అమ్మకాలు చేపట్టేందుకు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా  గొబ్యాం రోడ్డులో బైకు అదుపుతప్పి పడిపోయింది. దీంతో చందు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.


పాము కాటుతో ఒకరు.. బాడంగి: ఆకులకట్ట గ్రామానికి చెందిన ఉయ్యాల రాములు (55) నాగు పాము కాటుతో మృతిచెందినట్టు ఎస్‌ఐ సురేంద్రనాయుడు తెలిపారు. శుక్రవారం ఉదయం పొలంలో పాము కాటుకు గురైన రాములును స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. చికిత్స పొందుతుండగా మృతిచెందారు. రాములుకు ఇద్దరు కుమా రులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-08-22T09:12:59+05:30 IST