లారీ టైర్లు దొంగిలించిన వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2020-12-25T05:43:03+05:30 IST

విజయనగరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి, చెల్లూ రు గ్రామం వద్ద లారీ టైర్ల దొంగతనానికి పాల్పడిన మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్‌ సాహూను అరెస్టు చేసినట్లు విజయనగరం డీఎస్పీ అనిల్‌ పులిపాటి తెలిపారు.

లారీ టైర్లు దొంగిలించిన వ్యక్తి అరెస్టు
దొంగిలించిన టైర్లను పరిశీలిస్తున్న డీఎస్పీ అనిల్‌

విజయనగరం క్రైం: విజయనగరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి, చెల్లూ రు గ్రామం వద్ద లారీ టైర్ల దొంగతనానికి పాల్పడిన మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్‌ సాహూను అరెస్టు చేసినట్లు విజయనగరం డీఎస్పీ అనిల్‌ పులిపాటి తెలిపారు. గురువారం డీఎస్పీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో   వివరాలను వెల్లడించారు. ఈ నెల 21న విశాఖ పట్టణం, గంగవరం పోర్టునుంచి డ్రైవర్‌ సాహూ లారీలో బొగ్గులోడుతో ఛత్తీస్‌ఘడ్‌కు బయలుదేరాడు. సదరు లారీని చెల్లూరు వద్ద ఆపి అదే లారీ టైర్లను దొంగిలించి ఈ నెల 23న విజయ నగరంలో విక్రయించేందుకు ప్రయత్నించాడు. లారీ యాజమాని తన్వీర్‌ సింగ్‌కు టైర్లు దొంగతనానికి గురైనట్టు నమ్మబలికాడు. అనంతరం సాహు ఫోన్‌ స్వీచాఫ్‌ చేయడంతో అనుమానం వచ్చిన లారీ యాజమాని తన్వీర్‌ సింగ్‌ ఛత్తీష్‌ఘడ్‌ నుంచి విజయనగరం చేరుకుని విజయనగరం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  లారీ డ్రైవర్‌ దీపక్‌ సాహూ ఈ నెల 23న విజయనగరంలో టైర్లు అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌ సాహు నుంచి రూ. 70 వేలు విలువైన నాలుగు టైర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ అనిల్‌ తెలిపారు. కేసును ఛేదించిన విజయనగరం రూరల్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐలు నారాయణరావు, లక్ష్మీప్రసన్నకుమార్‌, ఏఎస్‌ఐ త్రినాథరావు, కానిస్టేబుల్‌ షఫీలను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో విజయనగరం రూరల్‌ సర్కిల్‌ సీఐ మంగవేణి, ఎస్‌ఐ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-25T05:43:03+05:30 IST