బాలికను కిడ్నాప్‌ చేసిన వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2020-03-19T10:42:23+05:30 IST

పట్టణంలోని కొత్తవలసకి చెందిన బాలికను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ దాశరథి

బాలికను కిడ్నాప్‌ చేసిన వ్యక్తి అరెస్టు

పార్వతీపురం టౌన్‌, మార్చి 18 : పట్టణంలోని కొత్తవలసకి చెందిన  బాలికను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ దాశరథి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ..   ఈ నెల 14  నుంచి తన కుమార్తె కనిపించడం లేదని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో  తండ్రి  ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు  పట్టణ ఎస్‌ఐ కళాధర్‌ , పోలీస్‌ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. బిత్తరపాడుకి చెందిన గందవరపు శ్రీను అనే ఆటో డ్రైవర్‌ మాయమాటల్ని నమ్మిన బాలిక తనకు తోడుగా రావాలని స్నేహితురాలిని కోరింది. దీంతో వారు ఆ యువకుడి వెంట వెళ్లారు.  అయితే బుధవారం పార్వతీపురంలో ఆర్టీసీ బస్సు ఎక్కిస్తున్న సమయంలో శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ వ్యక్తిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.  బాలికను  తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 

Updated Date - 2020-03-19T10:42:23+05:30 IST