విద్యుత్‌ ఉద్యోగుల ర్యాలీ జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2020-11-16T03:48:50+05:30 IST

జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించనున్న ర్యాలీని జయప్రదం చేయాలని విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్‌ డీఆర్‌ఎస్‌వీ ప్రసాద్‌ కోరారు.

విద్యుత్‌ ఉద్యోగుల ర్యాలీ జయప్రదం చేయండి
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న సంఘ ప్రతినిధులు

విజయనగరం రింగురోడ్డు, నవంబరు 15: జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించనున్న ర్యాలీని జయప్రదం చేయాలని విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్‌ డీఆర్‌ఎస్‌వీ ప్రసాద్‌  కోరారు. ఆదివారం దాసన్నపేట సమీపంలోని సంఘ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ  భారీ ర్యాలీ నిర్వహించ నున్నట్టు చెప్పారు. కోట జంక్షన్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ నిరసన ర్యాలీలో విద్యుత్‌ ఉద్యోగులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యుత్‌ సవరణ చట్టం వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సర్కార్‌ స్పందించకుంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. అనంతరం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు వరదరాజులు, రోజాకుమార్‌, రాజేంద్రప్రసాద్‌, అప్పలసూరి, ప్రసన్న కుమార్‌, నిర్మలమూర్తి, రామ్‌కుమార్‌, సీతారామరాజు, మస్తాన్‌ వలీ, జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-16T03:48:50+05:30 IST