-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Make the CM House a success
-
సీఎం సభను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2020-12-29T05:27:23+05:30 IST
విజయనగరం గుంఖలాంలో ఈనెల 30న పేదల ఇళ్ల స్థల పట్టాల పంపిణీకి రానున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సభను విజయ వంతం చేయాలని శృంగవరపుకోట శాసన సభ సభ్యుడు కడుబండి శ్రీనివాసరావు కోరా రు.

శృంగవరపుకోట, డిసెంబరు 28: విజయనగరం
గుంఖలాంలో ఈనెల 30న పేదల ఇళ్ల స్థల పట్టాల పంపిణీకి రానున్న సీఎం
జగన్మోహన్ రెడ్డి సభను విజయ వంతం చేయాలని శృంగవరపుకోట శాసన సభ సభ్యుడు
కడుబండి శ్రీనివాసరావు కోరా రు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో
విలేకర్లతో మాట్లాడారు. కార్య కర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని
పేర్కొన్నారు. జనవరి 7న నియోజ కవర్గంలో పట్టాలు పొందిన లబ్ధిదారులతో
కొత్తవలసలో ముగింపు సభను నిర్వహిస్తా మన్నారు. ఇళ్ల స్థలాలు పొందిన
లబ్ధిదారులంతా ఈ సభకు తరలిరావాలని పేర్కొన్నారు. ఇళ్ల స్థల పట్టాలకు
అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వైసీపీ
కార్యదర్శి ఇందుకూరి రఘురాజు, నాయకులు పినిశెట్టి వెంకటరమణ, మోపాడ కుమార్,
పెనగంటి జగదీష్, ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.