హత్యకేసులో జీవిత ఖైదు

ABN , First Publish Date - 2020-11-07T05:40:21+05:30 IST

హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఖైదీకి పార్వతీపురం న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించిందని కోర్టు లైజన్‌ అధికారి ఎస్‌.షణ్ముఖరావు శుక్రవారం తెలిపారు.

హత్యకేసులో జీవిత ఖైదు

బెలగాం: హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఖైదీకి పార్వతీపురం న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించిందని కోర్టు లైజన్‌ అధికారి ఎస్‌.షణ్ముఖరావు శుక్రవారం తెలిపారు. మక్కువ మండలం మూలవలస గ్రామంలో 2019 ఏప్రిల్‌ 28న గెంబలి ఎరకయ్య తన భార్య చిలకమ్మను మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో కత్తితో దాడి చేసి హతమార్చాడు. దీనిపై చిలకమ్మ అక్క మర్రి ఆదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి పార్వతీపురం సీఐ సీహెచ్‌ షణ్ముఖ కేసు నమోదు చేశారు. ఈ కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అద్దేపల్లి నారాయణరావు వాదనతో రెండవ అదనపు జిల్లా జడ్జి రాజగోపాలరావు ముద్దాయికి యావజ్జీవ జీవిత ఖైదుతో పాటు రూ.5వేలు జరీమానా విధించినట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2020-11-07T05:40:21+05:30 IST