-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Letter to ministers to open jute mill
-
జూట్ మిల్లుతెరవాలని మంత్రులకు లేఖ
ABN , First Publish Date - 2020-12-11T05:07:48+05:30 IST
జీగిరాం జూట్‌మిల్లు లౌకౌట్‌ను ఎత్తివేసి కార్మికులను ఆదుకోవాలని కార్మిక ,పరిశ్రమల శాఖల మంత్రులను కోరినట్లు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర గురువారం తెలిపారు.

సాలూరు, డిసెంబరు10: జీగిరాం జూట్‌మిల్లు లౌకౌట్‌ను ఎత్తివేసి కార్మికులను ఆదుకోవాలని కార్మిక ,పరిశ్రమల శాఖల మంత్రులను కోరినట్లు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర గురువారం తెలిపారు. గురువారం తన నివాసంలో విలేఖర్లతో మాట్లాడారు. ముడి సరుకు లేని కారణంగా జూట్ మిల్లు లాకౌట్ అయ్యిందన్న విష యాన్ని మంత్రులు దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఈ పరిశ్రమ ద్వారా నియోజకవర్గంలో సుమారు రెండు వేల మందికి ఉపాధి కలుగుతుందని, ఈనేపథ్యంలో మిల్లును తెరిపించాలని లేఖ రాసినట్లు వెల్లడిచారు. కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని శాసనసభలో తీర్మానం చేశామన్నారు. జగనన్న జీవ క్రాంతి పథకం ద్వారా నియోజకవర్గంలో 110 మంది లబ్ధిదారులకు 55 లక్షల విలువ చేసే గొర్రెలు,మేకలు,పశువులు ఇచ్చామని స్పష్టం చేశారు.