కరువు జిల్లాగా ప్రకటించండి

ABN , First Publish Date - 2020-09-12T11:45:13+05:30 IST

కరువు జిల్లాగా ప్రకటించండిపాం, అలుగోలు తదితర గ్రామాల్లో పర్యటించి కరువు పరిస్థితులను అధ్యయనం చేశారు. ఆయా ప్రాంతాల్లో రైతులతో చ

కరువు జిల్లాగా ప్రకటించండి

 నెల్లిమర్ల, సెప్టెంబరు 11:కరువు జిల్లాగా ప్రకటించండిపాం, అలుగోలు తదితర గ్రామాల్లో పర్యటించి కరువు పరిస్థితులను అధ్యయనం చేశారు.  ఆయా ప్రాంతాల్లో రైతులతో చర్చించారు.  కొన్నిచోట్ల వేసిన నాట్లు ఎండిపోయాయని, ఇంకొన్ని చోట్ల నాట్లు కూడా వేయలేదని చెప్పారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  50 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు అందించాలన్నారు.  సీపీఐ నాయకుడు టి.సన్నిబాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు దొర, జిల్లా సమితి సభ్యుడు టి.జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.

  ప్రైవేటు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలి 

విజయనగరం దాసన్నపేట:   ప్రైవేటు అధ్యాపకులు, ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం అమర్‌భవన్‌లో  మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే వారి పరిస్థితి  దయనీయంగా మారిందన్నారు. కొన్ని  నెలలుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. వారికి జీతాలు చెల్లించాలని విద్యాశాఖ జీవో విడుదల చేసినప్పటికీ, యాజమాన్యాలు స్పందించడం లేదని తెలిపారు.  దీనిపై జిల్లా అధికారులు స్పందించాలని కోరారు. 

 నెల్లిమర్ల, సెప్టెంబరు 11:  తీవ్ర వర్షాభావ పరిస్థితుల రీత్యా విజయనగరం జిల్లాను ప్రభుత్వం కరువు  ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం జరజాపుపేటతో పాటు  కొండవెలగాడ, కొండగుంపాం, అలుగోలు తదితర గ్రామాల్లో పర్యటించి కరువు పరిస్థితులను అధ్యయనం చేశారు.  ఆయా ప్రాంతాల్లో రైతులతో చర్చించారు.  కొన్నిచోట్ల వేసిన నాట్లు ఎండిపోయాయని, ఇంకొన్ని చోట్ల నాట్లు కూడా వేయలేదని చెప్పారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  50 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు అందించాలన్నారు.  సీపీఐ నాయకుడు టి.సన్నిబాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు దొర, జిల్లా సమితి సభ్యుడు టి.జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.

  ప్రైవేటు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలి 

విజయనగరం దాసన్నపేట:   ప్రైవేటు అధ్యాపకులు, ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం అమర్‌భవన్‌లో  మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే వారి పరిస్థితి  దయనీయంగా మారిందన్నారు. కొన్ని  నెలలుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. వారికి జీతాలు చెల్లించాలని విద్యాశాఖ జీవో విడుదల చేసినప్పటికీ, యాజమాన్యాలు స్పందించడం లేదని తెలిపారు.  దీనిపై జిల్లా అధికారులు స్పందించాలని కోరారు. 

Updated Date - 2020-09-12T11:45:13+05:30 IST