-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Larry auto hit man killed
-
లారీ ఆటో ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-03-23T09:53:09+05:30 IST
కురుపాం పంచాయతీ శోభాలత దేవి కాలనీ వద్ద లారీ - ఆటో ఢీకొన్న ఘటనలో యువకుడు మృతిచెందాడు. శనివారం రాత్రి గుమ్మలక్ష్మీపురం మండలం రాయగడ జమ్ము గ్రామానికి చెందిన

కురుపాం, మార్చి 22: కురుపాం పంచాయతీ శోభాలత దేవి కాలనీ వద్ద లారీ - ఆటో ఢీకొన్న ఘటనలో యువకుడు మృతిచెందాడు. శనివారం రాత్రి గుమ్మలక్ష్మీపురం మండలం రాయగడ జమ్ము గ్రామానికి చెందిన తిమ్మక చంద్రయ్య(21) ఆటోలో స్వగ్రామానికి వెళ్తున్నాడు. శోభాలత దేవి కాలనీ వద్దకు వచ్చేసరికి ఆటోను లారీ ఢీకొట్టింది. దీతో చంద్రయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రయ్య మృతిచెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు కురుపాం ఎస్‌ఐ కొల్లి రమణ తెలిపారు.