-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Language festivals from 21
-
21నుంచి భాషోత్సవాలు
ABN , First Publish Date - 2020-12-20T04:21:01+05:30 IST
కొవిడ్ నిబంధనల మేరకు జిల్లాలోని పాఠశాలల్లో ఈనెల 21 నుంచి 31వరకు భాషోత్స వాలను నిర్వహించనున్నట్లు డీఈవో నాగమణి శనివారం తెలిపారు.

విజయనగరం: కొవిడ్ నిబంధనల మేరకు జిల్లాలోని పాఠశాలల్లో ఈనెల 21 నుంచి 31వరకు భాషోత్స వాలను నిర్వహించనున్నట్లు డీఈవో నాగమణి శనివారం తెలిపారు. ఇందుకోసం మండల స్థాయిలో ఎంఈవో అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఉత్సవాల కోసం ప్రతి మండలానికి రూ.9వేల చొప్పున అందిస్తున్నామన్నారు. ఈ నిధులతో బ్యానర్లు, విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు, స్నాక్స్, తాగునీరు అందించనున్నామని చెప్పారు. 21న వ్యాసరచన పోటీలు, 22న మండల స్థాయిలో వ్యాసరచన, 23న పాఠశాల స్థాయి నాటిక పోటీలు, 24న మండలం స్థాయిలో, 26న లాంగ్వేజ్ గేమ్స్, 27న మండల స్థాయిలో, 28న పద్యాల పోటీల, 29న మండల స్థాయిలో, 30న చదవడం, రాయడం పోటీలు, 31న మండల స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ఇంటి నుంచి కూడా పోటీల్లో పొల్గొనొచ్చని తెలిపారు. విద్యార్థులు రాసిన పత్రాలను ఉపాధ్యాయులు లేదా సీఆర్‌పీల ద్వారా మండల స్థాయి పోటీలకు పంపించాలన్నారు.