-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Lab for dengue tests at the district headquarters
-
జిల్లా కేంద్రాసుపత్రిలో డెంగ్యూ పరీక్షలకు ల్యాబ్!
ABN , First Publish Date - 2020-12-29T05:08:13+05:30 IST
జిల్లా కేంద్రాసుపత్రిలో డెంగ్యూ పరీక్షలు నిర్వహించేం దుకు త్వరలోనే ల్యాబ్ ప్రారంభిస్తున్నట్టు విశాఖ జోనల్ మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ కెవీఎస్ ప్రసాదరావు తెలిపారు. సోమవారం జిల్లా ఆసుపత్రిని సందర్శించి ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలను పరిశీ లించారు.

రింగురోడ్డు: జిల్లా కేంద్రాసుపత్రిలో డెంగ్యూ పరీక్షలు నిర్వహించేం దుకు త్వరలోనే ల్యాబ్ ప్రారంభిస్తున్నట్టు విశాఖ జోనల్ మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ కెవీఎస్ ప్రసాదరావు తెలిపారు. సోమవారం జిల్లా ఆసుపత్రిని సందర్శించి ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలను పరిశీ లించారు. ఆసుపత్రిలో మలేరియా నిర్ధారణ పరీక్షలు ఎలా జరుగు తున్నాయి? అవసరమైన పరికరాలు ఉన్నాయా? లేవా? అన్న విషయాలపై సం బంధిత అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఇకపై డెంగ్యూ పరీక్షలు జిల్లా ఆసు పత్రిలో పకడ్బందీగా నిర్వహించాలని వైద్య సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, దశలవారీగా పార్వతీ పురం, సాలూరు, ఎస్‌కోట, చీపురుపల్లి ఆసుపత్రుల్లో కూడా పరీక్షలు ప్రారంభి స్తామని తెలిపారు. జిల్లా మలేరియా అధికారి తులసీ, కృష్ణాజీ, రామచంద్రుడు, నరసింహారావు తదితరులు ఉన్నారు.