తాతయ్య అని వెళ్తే.. ఆరేళ్ల చిన్నారిపై..

ABN , First Publish Date - 2020-05-08T14:55:38+05:30 IST

అభం.. శుభం తెలియని ఆరేళ్ల పసిపాప.. తాతయ్య వయసున్న వ్యక్తి చాక్లెట్ ఇస్తానంటే..

తాతయ్య అని వెళ్తే.. ఆరేళ్ల చిన్నారిపై..

కొత్తవలస(విజయనగరం): అభం.. శుభం తెలియని ఆరేళ్ల పసిపాప.. తాతయ్య వయసున్న వ్యక్తి చాక్లెట్ ఇస్తానంటే.. నిజమేనేమోనని నమ్మింది. అతని వెంట నడిచింది. కానీ ఆ వృద్ధుడు చిన్నారిపై దారుణానికి యత్నించాడు. ఈ దుర్ఘటన లక్కవరపుకోట మండలంలోని ఓ గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు, బాధితురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అలిపురపు సత్యం అనే 72ఏళ్ల వృద్ధుడు చిన్నారికి చాక్లెట్ ఇస్తానని ఆశ చూపాడు. తన పూరి గుడిసెలోకి తీసుకెళ్లాడు. అక్కడ పసిపాపపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.


అటుగా వెళ్తున్న ఓ బాలుడు ఇది చూసి.. పాప బంధువులకు తెలిపాడు. వారు వెంటనే అక్కడకు చేరుకుని వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్.ఐ కె.ప్రయోగమూర్తి వివరాలు సేకరించారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. లైంగిక దాడికి ప్రయత్నించిన వృద్ధుడు ఒంటరిగానే గుడిసెలో ఉంటున్నాడని.. అతని ఇద్దరు కొడుకులు హైదరాబాద్‌లో ఉంటున్నారని ఎస్ఐ తెలిపారు. చిన్నారి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2020-05-08T14:55:38+05:30 IST