టీడీపీలో జోష్‌!

ABN , First Publish Date - 2020-11-07T05:09:26+05:30 IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు సముచిత స్థానం లభించింది

టీడీపీలో జోష్‌!
సుజయ్‌కృష్ణ రంగారావురాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు సముచిత స్థానం

పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి/బొబ్బిలి/పార్వతీపురం/పూసపాటిరేగ)

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు సముచిత స్థానం లభించింది. జిల్లా నాయకులు కీలక పదవులు దక్కించుకున్నారు. దీంతో పార్టీలో జోష్‌ నెలకొంది. శుక్రవారం అధిష్టానం రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి  సుజయ్‌కృష్ణ రంగారావు, అధికార ప్రతినిధిగా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, కార్యదర్శులుగా భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, తాడంగి కేశవరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, తెంటు లక్షుంనాయుడు, కోళ్ల రామ్‌ప్రసాద్‌, కరణం శివరామకృష్ణ నియమితులయ్యారు. అన్నివర్గాలకు ప్రాధాన్యమిస్తూ పదవులకు ఎంపిక చేశారు.  ఇప్పటికే టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా, అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణిని నియమించారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, తెలుగు మహిళా అధ్యక్షురాలిగా సువ్వాడ వనజాక్షిని   ఎంపిక చేశారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర కమిటీల్లో అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యమిస్తూ సీనియర్లకు పదవులు కట్టబెట్టారు. 2024 ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా  ఎంపికలు జరిగాయి. ఎంపికైన నేతలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  తమపై నమ్మకంతో పదవులకు ఎంపిక చేసిన పార్టీ అధినేత చంద్రబాబు, యువ నాయకుడు నారా లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజులకు కృతజ్ఞతలు తెలిపారు. Updated Date - 2020-11-07T05:09:26+05:30 IST