డిప్లమో, ఐటీఐ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు
ABN , First Publish Date - 2020-12-16T05:25:27+05:30 IST
ఐటీఐ, డిప్ల్లమో చేసిన యువకులకు సీడాప్- డీఆర్‌డీఏ, వెలుగు ఆధ్వర్యంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ కె.సుబ్బారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
విజయనగరం (ఆంధ్రజ్యోతి) : ఐటీఐ, డిప్ల్లమో చేసిన యువకులకు సీడాప్- డీఆర్‌డీఏ, వెలుగు ఆధ్వర్యంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ కె.సుబ్బారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయనగరం, గజపతినగరం ప్రాంతాల్లోని కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని టీటీడీసీ మహిళా ప్రాంగణంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు వారు అర్హులని వెల్లడించారు. డిప్లమో (మోకానికల్), ఐటీఐ (ఫిట్టర్) పాసైన వారు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలతో రావాలన్నారు.