28న జాబ్మేళా
ABN , First Publish Date - 2020-11-27T05:07:14+05:30 IST
స్థానిక ఇందిరాగాంధీ డిగ్రీ కళాశాల ప్రాంగ ణంలో ఈ నెల 28న పలు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బలగ అప్పలనాయుడు గురువారం తెలిపారు.

బొబ్బిలి:
స్థానిక ఇందిరాగాంధీ డిగ్రీ కళాశాల ప్రాంగ ణంలో ఈ నెల 28న పలు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బలగ అప్పలనాయుడు గురువారం తెలిపారు. విశాఖ, హైదరాబాద్కు చెందిన వసుఽధ ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా, గ్రావిటీ ఫార్మా, కోవలెంట్ కంపెనీలలో శిక్షణ, ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. ఎంపికైన వారికి ఎస్డీఐ-సీఎంఎస్ స్కిల్ సెంటరులో 35 నుంచి 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తారని తెలిపారు. 25 ఏళ్లు మించని వారు, టెన్త్, ఐటీఐ, డిప్లమో అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులని సూచిం చారు. ఆసక్తి కలిగిన వారు అన్ని సర్టిఫికెట్లతో హాజరు కావాలని, పూర్తి వివరాలకు 8328191643 నెంబరకు ఫోన్ చేయాలని తెలిపారు.