పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై జేసీ తనిఖీ

ABN , First Publish Date - 2020-11-14T04:56:47+05:30 IST

పరిశ్రమల్లో ప్రభుత్వం నిర్ధేశించిన భద్రతా ప్రమాణాలపై ఆరా తీసే దిశగా జామి మండలం అన్నమరాజుపేటలోనున్న చక్ర సిమెంట్స్‌ పరిశ్రమను జేసీ జె.వెంకటరావు శుక్రవారం క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించారు.

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై జేసీ తనిఖీ

శృంగవరపుకోట రూరల్‌(జామి), నవంబరు 13: పరిశ్రమల్లో ప్రభుత్వం నిర్ధేశించిన భద్రతా ప్రమాణాలపై ఆరా తీసే దిశగా జామి మండలం అన్నమరాజుపేటలోనున్న చక్ర సిమెంట్స్‌ పరిశ్రమను  జేసీ  జె.వెంకటరావు శుక్రవారం క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక భద్రత అంశంలో ప్రభుత్వం రాజీలేని ధోరణి అవలంబిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ కోట ప్రసాదరావు, కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్‌ బి.సుదర్శనం, జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-14T04:56:47+05:30 IST